
బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు భీంగల్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బోదిరే స్వామి, పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య లు తెలిపారు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మునిసిపల్ మేనేజర్, మున్సిపల్ ఏఈ, వార్డు ఆఫీసర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.