
భీమ్ గల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన హౌసింగ్ ఏఈ తో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం గురించి ప్రభుత్వం మార్గదర్శకాలు చదివి వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు వివరించాలని ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన అంశాలను కమిటీ సభ్యులకు వివరించారు. పట్టణంలోని ఒకటవ వార్డులో అలాగే వివిధ వార్డులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు ముగ్గు పోయడం భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిఖిల్, హౌసింగ్ ఇంజనీర్ మున్సిపల్ మేనేజర్ నరేందర్, వాట్ ఆఫీసర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.