
వర్షానికి ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతన్నలు ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్ వద్ద ధర్నా రాస్తారోకో చేపట్టారు. తడిచిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికైనా స్పందించి ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన వెంటనే కొనుగోలు పూర్తి చేసి రైతన్నలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.