
జయ్ న్యూస్, సిరికొండ: మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 59వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహేష్ కుమార్ గౌడ్ కి కాంగ్రెస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాకారం రవి మాట్లాడుతూ.. పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ మచ్చలేని మనిషని, మన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తికి పీసీసీ అధ్యక్ష పదవి వరించడం మన అందరి అదృష్టమని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు. మరొకసారి మహేష్ అన్నకు 59 పట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ వేడుకలో కాంగ్రెస్ నాయకులు రాజేందర్ గౌడ్, శోభన్, దిగంబర్, దుమాల గంగారెడ్డి, కేశిరెడ్డి శ్రీను, జీల మల్లేష్, రామ్ రెడ్డి, చందర్, సంతోష్, రమేష్, శ్రీనివాస్, దేగం సాయన్న తదితరులు పాల్గొన్నారు.