
జయ్ న్యూస్, మెండోరా: మెండోరా మండల కేంద్రంలో TPCC అధ్యక్షుడు & MLC మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలతో కలిసి మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశామన్నారు. మహేష్ కుమార్ గౌడ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.