
జయ్ న్యూస్, హైదరాబాద్: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే నరేష్ అనారోగ్యంతో చికిత్స కోసం హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరడం జరిగింది.గురువారం నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాన్నైనా ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నానని, సీఎం సహాయనిధి నుండి 25 లక్షల రూపాయలు మంజూరు చేయాలని సీఎంఓ అధికారి వేముల శ్రీనివాస్ ను కోరడం జరిగిందని వారు పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా చికిత్సకు అయ్యే ఖర్చుని మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. ఎటువంటి పరిస్థితులైన అధైర్యపడవద్దని ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి చిన్నారెడ్డి, మధు, సాయినాథ్ రెడ్డి, పోచంపల్లి శీను తదితరులు ఉన్నారు