
జయ్ న్యూస్, హైదరాబాద్: హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర BJP కార్యాలయంలో జరిగిన 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం సంకల్పంతో సహకారం రాష్ట్ర కార్యశాల ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ MLA పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ MLA పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గత 11 ఏళ్లలో దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. BJP ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.