
జయ్ న్యూస్, సిరికొండ: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరులకు నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు. ఎంపీడీవో కేఆర్ మనోహర్ రెడ్డి, తహసిల్దార్ ఆర్. రవీందర్ రావు, బీఆర్ఎస్ అధ్యక్షుడు నారా బోయిన శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు గుర్రం సంజీవరెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. జై తెలంగాణ నినాదం ఓ గర్వానికి ప్రతీక” అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించారు.