
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చైర్మన్ డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు జాతీయ గీత లాపన పనిచేశారు. అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబాగౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, AMC చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. రైతులకు పెద్దపీట వేసిందని, వర్షాకాలం వస్తున్నందున నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. రైతులకు న్యాయమైన విత్తనాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఇట్టెం జీవన్, డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, తాజా మాజీ వైస్ చైర్మన్ మున్ను, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగ గౌడ్, నటరాజ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ యువజన అధ్యక్షుడు విజయ్ అగర్వాల్, కార్యకర్తలు పాల్గొన్నారు.