
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నాణ్యమైన విత్తనం రైతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు సబ్సిడీ విత్తనాలు అందజేశామని ఏవో రాంబాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ దేగాం ప్రమోద్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రమ్య, వసుధం, సొసైటీ వైస్ చైర్మన్ రైతులు పాల్గొన్నారు.