
జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: మంగళవారం ప్రొ” జయశంకర్ విశ్వవిద్యాలయం వారు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ” నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం” అనే కార్యక్రమంలో భాగంగా జక్రాన్ పల్లి రైతు వేదికలో మండలంలోని అన్ని గ్రామాల రైతులకు RDR -1200 రకం వరి వంగడాన్ని మరియు పెసలు విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఊరిలో 3గురు లేదా 5 గురు ఆదర్శ రైతులకు 10 కిలోల చొప్పున అందించడం జరిగింది. ఎకరాకు 35 క్వింటాళ్ల నాణ్యమైన దిగుబడి సాధించడం దీని ప్రత్యేకత… ఇట్టి కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా రాష్ట్ర రైతు నాయకులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా కమిటీ సభ్యులు కోటపాటి నరసింహం నాయుడు పాల్గొన్నారు. రుద్రూర్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం అధిపతి డా” T. అంజయ్య, మండల వ్యవసాయ అధికారిణి దేవకి, వ్యవసాయ శాస్త్రవేత్త రాకేష్, అర్గుల్ సొసైటీ అధ్యక్షులు గంగారెడ్డి మరియు మండల AEO లు పాల్గొని, విత్తనాలను రైతులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటపాటి మాట్లాడుతూ రైతు ఎప్పటికప్పుడు మన జిల్లాలోని రుద్రూర్ పరిశోధన కేంద్రం మరియు రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ లను సందర్శించి కొత్త కొత్త పరిశోధన ఫలితాలను తెలుసుకొని తమ తమ వ్యవసాయ క్షేత్రాలలో పండించి, అధిక దిగుబడిని సాధించాలని రైతులకు కోరారు. ఈ కార్యక్రమంలో డా” అంజయ్య, దేవకి, మరియు సొసైటీ చైర్మన్ గంగారెడ్డి లు ప్రసంగించి తగిన సూచనలు చేశారు.