
జయ్ న్యూస్, ఆలూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా ప్రజల భూ సంబంధిత సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయని ఆర్మూర్ RDO రాజాగౌడ్ అన్నారు. మంగళవారం ఆలూర్ మండలంలోని మిర్దపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెవెన్యూ సదస్సులను RDO రాజాగౌడ్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో ప్రారంభమైన ఈ సదస్సులో తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ, రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలంటే భూభారతి ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అరవింద్ , ఏఆర్ఐ రేనా భాయ్, శ్రీజ, ప్రశాంత్, సర్వేయర్ రమేష్, జూనియర్ అసిస్టెంట్ సురేష్, గీత, నరేష్, సరిత, వసుందర, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.