
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ దేవస్థానం ఆవరణలో ఉన్న దుకాణాల సముదాయాలలో గల కాంప్లెక్స్ నెంబర్ 2లో షాప్ నెంబర్: ఒకటి, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది మరియు కాంప్లెక్స్ నెంబర్ మూడు లో గల షాప్ నెంబర్: రెండు మూడు నాలుగు ఎనిమిది మొత్తం 11 షాపులకు తేదీ 01-07-2025 నుండి 30-06-2027 వరకు రెండు సంవత్సరాల కొరకు లీజు కిరాయి కొరకు బహిరంగ వేలం ఈనెల 21వ తేదీ శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీందర్ తెలిపారు. ఆసక్తి గలవారు బహిరంగ వేలంలో పాల్గొనే వారు ముందుగా పదివేల రూపాయలను డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాలని సూచించారు.