
జయ్ న్యూస్, వేల్పూర్: వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు స్వరూప వాళ్ళ అమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నేడు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.