
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం మంథని గ్రామంలో మండల బిజెపి అధ్యక్షులు వినోద్, రాష్ట్ర నాయకులు అందాపూర్ రాజేష్ ఆధ్వర్యంలో రేపు నిజామాబాద్ నగరంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విచ్చేస్తున్నారని, పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొంటారని కోరుతూ ఈ కార్యక్రమాలకు రావాలని గ్రామ రైతులకు, ప్రజలకు బీజేపీ నాయకులు ఆహ్వాన పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు 11 సంవత్సరాల మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రైతులు, ప్రజలకు వివరించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి విగ్నేష్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు సాయి, మాజీ ఎంపీటీసీ గొల్ల గంగారం, నక్కల భూమారెడ్డి, జైడి శ్రీనివాస్ రెడ్డి, సురేష్, కనకయ్య, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.