
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ దేవి యూత్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారి గుడి వద్ద “వనమహోత్సవం” చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శుక్రవారం స్థానిక కాంగ్రెస్ నాయకుడు బండారి శాల ప్రసాద్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పుకొచ్చారు. నాటిన మొక్కలను ప్రతి ఒక్కరు సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవి సొసైటీ అధ్యక్షులు గుండెం స్వామి, దేవాంగ సంఘం అధ్యక్షుడు తొగర్ల రాజేశ్వర్, శుక్రవారం దేవి ఆలయ అధ్యక్షుడు అరె లింబాద్రి, మరియు దేవి సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.