
జయ్ న్యూస్, వేల్పూర్: వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో గురువారం రోజున గ్రామానికి విచ్చేసిన ఉట్నూర్ సుభాష్ ని ఘనంగా శాలువాలతో జిల్లా గంగాపుత్ర సంఘం సభ్యులు సన్మానించారు. ఉట్నూర్ సుభాష్ గత 31 సంవత్సరాల మూడు నెలలు మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గా నిబద్ధతతో విధులు నిర్వహించి ఎందరో మన్ననలు పొంది జూన్ 30న పదవి విరమణ పొందిన లక్కోర గ్రామవాసి… గంగపుత్ర ముద్దుబిడ్డ.. ఉట్నూర్ సుభాష్ కు ఈ సందర్భంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకారుల సహకార సంఘం మాజీ డైరెక్టర్ బట్టు నరేందర్, గంగపుత్ర సంఘ అభివృద్ధి గౌరవ అధ్యక్షులు ఉట్నూర్ బాలయ్య, పల్లికొండ నర్సయ్య, సంఘ అభివృద్ధి లీగల్ అడ్వైజర్ దుబ్బాక రవికుమార్, గంగపుత్ర సంఘ సభ్యులు పల్లికొండ నవీన్ కుమార్, బట్టు లక్ష్మణ్,మాడవేడి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.