
జయ్ న్యూస్ , ఆర్మూర్ : నిజామాబాద్ నగరంలో గల నాగారాం స్టేడియంలో నిర్వహించబడిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొన్న చేపూర్ క్షత్రియ పాఠశాల విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించి ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో రెండవ స్థానాన్ని పొందారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించబడిన ఒక కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పోటీల్లో పాల్గొని అధ్భుత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. క్రీడలు ఐకమత్యాన్ని, స్నేహభావాన్ని పోటీతత్వాన్ని ప్రతిబింపజేస్తాయని అన్నారు. అందుకే క్షత్రియ విద్యా సంస్థలు క్రీడలకు అధిక ప్రాదాన్యతనిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతరామరాజు జయంతి కార్యక్రమన్ని పురస్కరించుకొని ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని అన్నారు. తొమ్మిదో తరగతి విద్యార్ధి కుర్మ వేదాంత్ లాంగ్ జంప్ మరియు 60 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించినాడని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి చదువు, సంస్కారంతోపాటు క్రీడా పోటీల్లో పాల్గొనడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పి.ఇ.టి లు, విద్యార్థులు పాల్గొన్నారు.