
జయ్ న్యూస్, ఆర్మూర్: ప్రజ్ఞ ఐఐటీ క్యాటలైజర్ విద్యా సంస్థలో నూతన విద్యా సంవత్సరం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు సిబ్బంది పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ కొత్త విద్యా సంవత్సరానికి తమ పిల్లల భవిష్యత్తు బాగుపడాలని ఆశిస్తూ నమ్మకంతో విద్యార్థులను పంపిన తల్లిదండ్రులకు సంస్థ కరెస్పాండెంట్ ప్రజ్ఞ వంశీ కృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.
విద్యతో పాటు విద్యార్థులలో మానవీయ విలువలు, నైతికత, మరియు భారతీయ సంస్కృతిని అలవరచే విధంగా కార్యాచరణ రూపొందించబడింది.ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రజ్ఞ ఐఐటి– క్యాటలైజర్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. విద్యతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధికి శ్రద్ధను కేంద్రీకరించనున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు సంస్థ చేపట్టబోయే కార్యాచరణలపై విపులంగా వివరణ ఇవ్వబడింది. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడే అనేక సాంస్కృతిక మరియు విలువ ఆధారిత కార్యక్రమాలు కూడా ఈ విద్యా సంవత్సరం లో భాగంగా ఉంటాయని నిర్వాహకులు ప్రజ్ఞ వంశీ కృష్ణ తెలిపారు.