
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులు, మంచినీటి వసతి, కరెంటు రిపేర్లు, ఇతర కనీస వసతుల నిమిత్తం 3 కోట్ల 23 లక్షల ఒక వెయ్యి రూపాయలను రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య మంజూరు చేసినట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు.
నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు 30 లక్షలు, నిజామాబాద్ ప్రభుత్వ బాలుర ఖిల్లా జూనియర్ కళాశాలకు 56 లక్షలు, డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 14 లక్షలు, మాక్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 10 లక్షలు, మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 26 లక్షల 35వేలు, వర్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 20 లక్షల 50 వేలు, బోధన్ మధుమలాంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 10 లక్షల 70 వేలు, ఆర్మూర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 16 లక్షలు, ఆర్మూర్ బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 24 లక్షలు, భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 18 లక్షలు, ఐలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తొమ్మిది లక్షలు, బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 33 లక్షల 5 వేలు, ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 25 లక్షలు, కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 30 లక్షల 50 వేలు మంజూరు అయినట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలియజేశారు.
ఇంటర్ విద్య బలోపేతం కోసం కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు మంచినీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, కళాశాలలకు సున్నం వేయడం, ఇతర చిన్న చిన్న మరమ్మతులు, ఫర్నిచర్, విద్యార్థులకు బెంచీలు, బ్లాక్ బోర్డుల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు.