
జయ్ న్యూస్, సిరికొండ: సిరికొండ మండలానికి మంచి చేసిన పోలీసు అధికారుల్లో ఎస్ఐ ఎల్. రామ్ పేరు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. శనివారం ప్రభుత్వం ఆయనకు బదిలీ ఉత్తర్వులు జారీ చేయడంతో, స్థానిక ప్రజలు ముక్తకంఠంతో “మంచికి మారుపేరు రామ్ సార్” అంటూ భావోద్వేగంగా స్పందించారు.
న్యాయం కోసం నిరంతర పోరాటం,
ప్రజలతో నిత్యం మమేకం,
అక్రమాలపై పటిష్ఠమైన చర్యలు,
అధికారంలో సౌమ్యత్వం – ఆచరణలో దృఢత్వం,
ఇవన్నీ రామ్ సార్ శైలికి ప్రతిరూపాలు….
ఆయన బాధ్యత చేపట్టిన నాటి నుంచి సిరికొండలో నేరాలపై కఠినమైన పట్టు, శాంతి భద్రతల పరిరక్షణలో అపార నిబద్ధత, తీవ్ర చర్యలతో నేరస్థుల్లో భయం, ప్రజల్లో భరోసా నెలకొన్నాయి.
తెగింపు తీర్పులు – ధైర్యవంతమైన నిర్ణయాలు – వినయంతో నడవడం ఇవన్నీ కలగలిపిన అరుదైన అధికారి రామ్ సార్.
పేదలకు మద్దతుగా, బాధితులకు న్యాయం కోసం ఆయన చేపట్టిన అనేక చర్యలు స్థానికులకు చిరస్మరణీయం.
పోలీసు స్టేషన్ కంటే ప్రజల మనసుల్లో ఎక్కువ రోజులు స్టేషనవ్వగలిగిన అరుదైన అధికారి అని సిరికొండ ప్రజలు భావిస్తున్నారు.
చోరీల కేసులు, కుటుంబ కలహాలు, మహిళల సమస్యలు, యువతలో అవగాహన – ఏదైనా విషయంలోనూ ఆయన ‘ప్రత్యేక ముద్ర’ కనిపించేది.
బదిలీ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, సీనియర్ పౌరులు ఆయన సేవలను కొనియాడుతూ, “రామ్ సార్ సేవల్ని మర్చిపోలేము – మీ కొత్త పోస్టింగ్లోనూ అదే న్యాయపోరాటం కొనసాగాలని ఆశిస్తున్నాం” అని సందేశం ఇచ్చారు.