
జయ్ న్యూస్, సిరికొండ: జూలై 6 : సిరికొండ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా మామిడిపల్లి కళ్యాణి ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె స్టేషన్ సిబ్బందితో సమావేశమై విధుల నిర్వహణపై మార్గదర్శకాలు ఇచ్చారు. అనంతరం ఎస్సై మీడియాతో మాట్లాడుతూ – “శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పని చేస్తానని పేర్కొన్నారు. మహిళల భద్రత, యువతలో నేరభావాల నివారణకు చర్యలు తీసుకుంటాను. ప్రజలతో స్నేహపూర్వకంగా,న్యాయపూర్వకంగా ముందుకెళ్తాను” అని వెల్లడించారు. ప్రజలు కూడా పోలీసులకు తమ వంతు సహకారం అందించాలని కోరారు.