
జయ్ న్యూస్, భీమ్ గల్: భీంగల్ పట్టణంలోని మంగళవారం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఎన్ఎస్యుఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రెహ్మాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రెహమాన్ మాట్లాడుతూ 108,104,ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు వైయస్సార్ అని వారు కొనియాడారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషిచేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని అన్నారు. ఇంతటి మహానుభావుడు ఆశయాలను యువత ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రిషి, ముఖేష్ ,అజయ్ ,రుత్విక్, లక్ష్మణ్, రిషి ,బిట్టు, ఓంకార్, బన్నీ ,అఖిల్, తదితరులు పాల్గొన్నారు.