
జయ్ న్యూస్, ఆర్మూర్:
క్షత్రియ మహిళా మండలి సభ్యుల బోనాలతో ఊరేగింపు
– ముత్యాలమ్మ, నల్ల పోచమ్మలకు జలాభిషేకం..
– నల్ల పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించిన మహిళలు..
ఆర్మూర్, జూలై 9: అమ్మ.. తల్లి మమ్ములను, క్షత్రియ కులస్తులను ఆయురారోగ్యాలతో ఉంచాలని, పిల్లాపాపలతో సల్లంగుంచాలని కోరుతూ క్షత్రియ మహిళా మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం చిన్న బజార్ లో గల లక్ష్మీనారాయణ మందిరం నుంచి మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ముందుగా లక్ష్మీనారాయణ మందిరం నుంచి గోల్ బంగ్లా మీదుగా ముత్యాలమ్మ ఆలయం వరకు ఊరేగించి గోదావరి జలాలతో అభిషేకం చేశారు. తిరిగి బోనాలతో నల్ల పోచమ్మ వరకు కాలినడకన వెళ్లి జలాభిషేకం చేశారు. అనంతరం నల్లపోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు. భక్తిశ్రద్ధలతో హారతి ఇచ్చి పాటలు పాడారు. అనంతరం మహిళలంతా కలిసి సామూహికంగా భోజనాలు చేశారు. రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు రెడ్డి ప్రకాష్, ఉపాధ్యక్షుడు జెస్సు ఆనంద్, కోశాధికారి వైద్య సంజయ్, సభ్యులు సాత్ పుతే శ్రీనివాస్, బొబిడే గంగా కిషన్, యువజన సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు సాత్ పుతే సంతోష్, దుమాని నీరజ్, మహిళా మండలి సభ్యులు సంగీత ఖాందేశ్, గటడి స్వాతి, డీజే సులోచన, హజారి అనసూయ, అల్జాపూర్ రాజ సులోచన, జెస్సు లలిత, సాత్ పుతే మంజుల, అల్జాపూర్ చంద్రకళ, గుజరాతి లక్ష్మి, జుగ్గే ప్రమీల, గుజరాతి గీత, డీజే యశోద, డీజే లత, జెస్సు మధుమతి, గటడి గంగామణి, ఘటడి జయశ్రీ, పోహార్ శ్రీవిద్య, సాత్ పుతే రూప, జీవి అఖిల, రంజిత, చందు వనిత, ఘటడి గంగామణి, దొండి లలిత, గటడి మమత, బాదం సునంద తదితరులు పాల్గొన్నారు.