
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని గాంధీ నగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఐఐటి నీట్ ఫౌండేషన్ కోర్సుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ కే కే ఒలంపియాడ్ ఇంటర్నేషనల్ అకాడమిక్ డైరెక్టర్ కొండవీటి కిషోర్ హాజరై మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఆరవ తరగతి నుండే ఐఐటి నీట్ లాంటి ఫౌండేషన్ కోర్సులు అవశ్యమని అన్నారు పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు ఇలాంటి కోర్సులు నేర్చుకుంటే వారికి విమర్శనాత్మక ఆలోచన శక్తి సమయపాలన విధానం ఆత్మస్థైర్యం లాంటి నైపుణ్యాలు పెంపొందుతాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీపరీక్షలైనటువంటి ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎన్ డి ఏ ఐఎన్ఈటి లకు కూడా ఈ ఫౌండేషన్ కోర్సులు చాలా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. విద్యార్థులు అడిగినటువంటి సందేహాలను నివృత్తి చేశారు. ఐఐటి ఎన్ ఈ టి ఫౌండేషన్ కోర్స్ కు ఆరవ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రతి క్లాస్‌కు ఒక ప్రత్యేక బ్యాచ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పాలనాధికారిణి పద్మ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.