
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ శివారులో గల ఆల్ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో హౌస్ ఎలక్షన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో పాఠశాల విద్యార్థులందరూ పాల్గొని తమ ఓటు హక్కు ద్వారా వారి వారి హౌస్ కెప్టెన్, వైస్ కెప్టెన్ లను ఎన్నుకున్నారు. ఈ విధంగా ప్రతి ఏడాది పాఠశాలలో డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు హౌస్ ఎలక్షన్స్ నిర్వహించబడతాయని పాఠశాల యాజమాన్యం తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంతో కీలకం అని, ఓటు హక్కు పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించడం వల్ల విద్యార్థులలో ఎన్నికల పట్ల అవగాహన వస్తుందని, అలాగే విద్యార్థుల్లోని నాయకత్వ లక్షణాలను వెలికితీయడం కోసం ఎన్నికలు ఎంతగానో దోహద పడతాయన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఎంతో చక్కగా వారి విధులను నిర్వహించి విద్యార్థులకు సరైన సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులను ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అభినందించారు.