
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు విశ్వం హెరిటేక్ వారి ఇంగ్లీష్ ల్యాబ్ శిక్షణ ఇవ్వడం జరిగింది. విశ్వం ఎడ్యుటేక్ వారి ఆధ్వర్యంలో ఇంగ్లీష్ ల్యాబ్ ట్రైనర్ కిషోర్ సమక్షంలో అనుభవపూర్వక ఆంగ్ల అభ్యాసం (ELL) ఆంగ్ల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో విద్యార్థుల తో ఇంగ్లీష్ లో మాట్లాడించడానికి, ఇంగ్లీషులో చదవడానికి, వారి యొక్క ప్రొనౌన్షియేషన్ లో మార్పు ఏ విధంగా తీసుకురావాలో అనే అంశాల పైన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందాని నలంద యాజమాన్యం ప్రసాద్, సాగర్ లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులో నలంద ఉపాధ్యాయులు ప్రవళిక, సరితా,సౌమ్య, ప్రవళిక, సమీర్, అనంతరావు మరియు అకాడమిక్ ఇంచార్జ్ అతుఫా నౌషిన్ లు శిక్షణ తరగతిలో పాల్గొన్నారు.