
జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జక్రాన్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఉత్కం శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీసీలకు పదవులు దక్కుతాయని తాను అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ ప్రభుత్వం నిర్ణయం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నాయకులందరూ సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ జెండాను ఎగరవెయ్యాలన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డికి బీసీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.