
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ ఆలూర్ మండలంలో 511 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని, వీటిలో 234 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తి అయ్యిందని, 46 మందికి తొలి విడతగా రూ.1 లక్ష చొప్పున నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.
అదే విధంగాకాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై చర్యలు చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం జరగడం కాంగ్రెస్ ప్రభుత్వ వల్లే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజా సంక్షేమ పథకాలను సామాన్య ప్రజల వరకు చేరవేసేందుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగరాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు రేషన్ కార్డుల ప్రక్రియ కూడా న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీనికి సహకరిస్తున్న నియోజకవర్గ ఇంచార్జ్ వినయ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ డేగ పోశెట్టి, వైస్ మల్లారెడ్డి, నవనీత్, ఉదయ్, సంజీవ్, గంగారెడ్డి, శ్రీనివాస్, సాయి, శశి,వినోద్, భరత్, మహేష్, మాజీ సర్పంచ్ చిన్నయ్య, లబ్ధిదారులు పాల్గొన్నారు.