
జయ్ న్యూస్, మాక్లూర్: మాక్లూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి ప్రకాష్ ఆధ్వర్యంలో బీసీలకు 42%శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకుగాను ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వినయ్ రెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో జనాభాను బట్టి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఆలోచన ప్రకారం మన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు 42%శాతం పెంచి నిన్న మంత్రి వర్గంలో ఆమోదం తెలిపినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సామాజిక న్యాయం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అయింది… కావున బీసీ బిడ్డలంతా కాంగ్రెస్ పార్టీతో ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.