
జయ్ న్యూస్, మాక్లూర్: మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో 2024-25 సంవత్సరానికి గాను పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బాసర త్రిబుల్ ఐటీలో సీటు సంపాదించిన నూనె హర్షిత D/o నూనె సూర్యనారాయణ, పాల్దే రిషి యశస్వి S/o పాల్దే భూమయ్య లను మామిడిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ మరియు స్కూలు ఉపాధ్యాయ బృందం ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేసి వారికి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగోనీ సంతోష్, క్యాషియర్ బోర్డుకి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు బాబు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.