
జయ్ న్యూస్, సిరికొండ: సిరికొండ మండలంలోని గడ్కోల్ లో సోమవారం POW మండల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి పాల్గొన్న POW జిల్లా అధ్యక్షురాలు పి రమ మాట్లాడుతూ ప్రతి వర్షకాల సీజన్ రాగానే అంటూ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలి వేశాయని దుయ్య బట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ లాంటి విష జ్వరాలు వచ్చి పేద ప్రజలు మంచం పట్టరని అన్నారు. ఇదే ఆదనుగా ప్రవేటు హాస్పిటల్ లు ప్రజలను దోచుకొంటున్నారని అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేయడం, రోగులను నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రిల నిలువు దోపిడీని అరికట్టలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దవాఖానలు అంటే వైద్యం దొరకని పరిస్థితి ఉన్నది. ఒకవైపు సరియైన సౌకర్యాలు రోగులకు లేక, మందులు అందుబాటులో లేక, డాక్టర్లు లేక పేదలకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందని ద్రాక్ష అయిందని అని అన్నారు. షుగర్ టెస్ట్ లు ఎక్స్రేలు, అన్ని రకాల బ్లడ్ టెస్ట్ లు ఈసీజీ సౌకర్యం, మందులు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వ్యాధుల బారిన ప్రజలు పడి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నామంటూ ఉన్న ప్రభుత్వం పేదలకు అవసరమైన వైద్య సేవలపై దృష్టి సారించకపోవడం శోచనీయం అని అన్నారు. రోగులకు పరీక్షలు నిర్వహించే ల్యాబ్ పరికరాలు, టెక్నీషియన్ సిబ్బంది, వైద్య పరికరాలు, రోగులకు సంబంధించిన మందులు , డాక్టర్స్ కొరత వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు గగనం అయిపోయిందని అన్నారు.
ప్రజల కు మెరుగైన వైద్యం అందించి పేదల ప్రాణాలు కాపాడాలని వైద్యం పేరుతో దోచుకుంటున్న ప్రయివేట్, కార్పొరేట్ హాస్పటల్లని నియంత్రణ చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్ పుష్ప లత (pow డివిజన్ కార్యదర్శి)డివిజన్ నాయకులు సిరికొండ గంగామణి, ఏ సావిత్రి, ఎస్ లకిత, ఎస్ విజయ, ఎస్ బాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.