
జయ్ న్యూస్, భీమ్ గల్: భీమ్ గల్ పట్టణంలోని పదో వార్డులో గల ఎస్సీ బాలుర హాస్టల్లో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్లో ఉన్న సమస్యలను విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన కూరగాయలను పరిశీలించారు. మంచినీటి వాటర్ ప్లాంట్ ని పరిశీలించి రిపేర్ ఉన్నందున తొందరగా రిపేర్ పూర్తి చేయాలని వార్డెన్ కు సూచించారు.
వందరోజుల కార్యచరణలో భాగంగా పట్టణంలో గల పబ్లిక్ టాయిలెట్స్ లను కమిషనర్ పరిశీలించారు. పబ్లిక్ టాయిలెట్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్, వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.