
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ కు చెందిన విద్యార్థులు కందగడ్ల రుద్రంష్ s/o సంతోష్ కుమార్ R/O ఆర్మూర్ (హల్ టికెట్ నెంబర్ :3616180)అనే విద్యార్థి నవోదయ విద్యాలయ సమితిలో (నిజామాబాద్) జిల్లా స్థాయిలో అర్బన్ నుండి మొదటి ర్యాంకు సాధించి 6వ తరగతికి ఎంపిక కావడం జరిగింది. మరియు బాకూర్ మాణితేజ s/o ఎల్లేష్ r/o ఆర్మూర్ (హల్ టికెట్ నెంబర్ :3616247) జిల్లా స్థాయిలో అర్బన్ నుండి ఎనిమిదివ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులను జిల్లా కార్యదర్శి రావినాథ్, పాఠశాల మేనేజ్మెంట్ భానుతేజ్, ప్రిన్సిపల్ వినోద్ కుమార్ లు సన్మానించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.