
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాలలో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులు చాలా ఉత్సాహంగా బోనాలను తయారుచేసి మరియు రకరకాల ప్రసాదాలను తీసుకువచ్చారు. మన తెలంగాణలో జరుపుకునే ముఖ్యమైన బోనాల పండుగ గురించి పాఠశాల యొక్క చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ సూచనల మేరకు ఈ సంబరాలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అల్జాపూర్ లక్ష్మీనారాయణ వారి సతీమణి రాజా సులోచన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అల్జాపూర్ గంగాధర్, దేవేందర్ లు మాట్లాడుతూ బోనాలు పండగ విశిష్టత గురించి విద్యార్థులకు చాలా క్లుప్తంగా వివరించామని తెలిపారు. ముందుగా కాలనీలో బోనాలతో విద్యార్థిని, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది ఊరేగింపు నిర్వహించారని తెలిపారు. బోనాల పండుగ మన తెలంగాణా ప్రజల ఉనికిని, మన ఐకమత్యాన్ని తెలియజేస్తుందని అన్నారు. క్షత్రియ విద్యాసంస్థల్లో అన్ని పండుగలను విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ముఖ్యమేనని, మన తెలంగాణ చరిత్ర కూడా విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. మహంకాళి అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నటే అని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నవిత పేర్కొన్నారు. విద్యార్థులు శివసత్తుల మరియు పోతరాజుల వేషధారణలతో చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం పరీక్షిత్, అక్షయ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు.