
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులలో పఠన శక్తిని పెంపొందించడానికి శుక్రవారం పాఠశాలలో గ్రంథాలయాన్ని ప్రధానోపాధ్యాయులు విశ్వనాథ్ ప్రారంభించారు. ఒక విజ్ఞాన సమాజాన్ని సృష్టించడానికి పుస్తక పఠనం ఎంతో అవసరం అన్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. రకరకాల మాధ్యమాలు ఏర్పడిన పుస్తకం ప్రాముఖ్యత ప్రత్యేకమైనది అన్నారు.
వ్యక్తి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ఏర్పరచడానికి పుస్తకాలు ఎంతో సహకరిస్తాయన్నారు. మహాత్ములు, దేశభక్తులు, ఆధ్యాత్మిక పురుషుల పుస్తకాలు, సైన్స్, మ్యాచ్ కు సంబంధించిన సుమారు 1000 పుస్తకాలతో కూడిన లైబ్రరీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ ఇంచార్జ్ డాక్టర్ నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.