
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని 19వ వార్డుకు చెందిన పల్లికొండ పోశెట్టికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద మంజూరైన 60 వేల రూపాయల CMRF చెక్కును వార్డు ఇన్చార్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్ అందజేశారు. చెక్కు మంజూరుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల శ్రీనివాస్ గౌడ్, జిమ్మి రవి తదితరులు పాల్గొన్నారు.