
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణానికి చెందిన మెట్టు ముత్తన్న అనారోగ్య కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది.. వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి CMRF కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. శనివారం వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ నాయకులు 2 లక్షల నలభై వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు నర్సారెడ్డి, ఆకుల రాము, సిద్దుల గుట్ట కమిటీ సభ్యులు జిమ్మి రవి పాల్గొన్నారు.