
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్లో ఘనంగా అమ్మవారి బోనాల సంబరాలు నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపాల్ సాగర్ లు బోనాల పండుగ ప్రాముఖ్యతను మరియు మన ఆచార సంప్రదాయం గురించి విద్యార్థులకు వివరించారు. తర్వాత బోనాలను ఊరేగింపుగా పోతరాజు విన్యాసాలతో అంగరంగ, వైభవంగా బోనాలను అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి పూజ తరువాత విద్యార్థిని, విద్యార్థులు అమ్మవారి పాటలపై నృత్యాలను చేయడం అందరిని ఆకట్టుకున్నాయి. పాఠశాల ఉపాధ్యాయులు బోనాల గురించి విద్యార్థులకు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాలుపంచుకున్నారు.