
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో బోనాల పండుగ సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరు సాంప్రదాయక దుస్తులతో అందరినీ ఎంతగానో అలరించారు. అంతేకాకుండా పోతరాజు అమ్మవారి వేషాలు వేసుకొని అందర్నీ ఎంతగానో అలరించారు. ముఖ్యంగా బోనాలు ఎత్తుకొని ఊరేగింపులో పోతరాజు వేషంలో చక్కని నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పూజలు చేసి నైవేద్యం సమర్పించి విద్యార్థులందరూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ బోనాల పండుగ మన తెలంగాణ ప్రజల ముఖ్యమైన పండగ అని ఈ పండగ మన తెలంగాణ ఉనికి ఐక్యమత్యాన్ని తెలుపుతుందని ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం అర్పించడం వల్ల ఎలాంటి అంటువ్యాధులు రావని ప్రజలు నమ్ముతారని అందుకే ఆషాడం మొదటి నుండి చివరిదాకా ఈ పండగ నిర్వహిస్తారని పండగ యొక్క విశిష్టతను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.