
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్ లో తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి శాల ప్రసాద్ 54 వేల రూపాయల విలువ గల CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దొంద లక్ష్మికి 20000, తండూరి రాజుకు 16000, తలారి నరసయ్య కు 18000 రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేసామని తెలిపారు. చెక్కుల మంజూరుకు కృషిచేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి పాలైన పేదలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.