
జయ్ న్యూస్, ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి ఆధ్వర్యంలో 257 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 2745 మందిని లబ్ధిదారులుగా యాడ్ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడం” అని స్పష్టం చేశారు.మీసేవ కేంద్రాల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే సంబంధిత ఆపరేటర్లను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. గత పది సంవత్సరాలుగా కార్డు కోసం తిరుగుతున్నామని, ఈ ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం జరిగిందని లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ చైర్మన్ ముప్పగంగారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, యువ నాయకుడు ఉమ్మాజీ నరేష్, ఆర్డీవో రాజేంద్రకుమార్, మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, మాజీ ఎంపిటిసి కిషన్ తదితరులు పాల్గొన్నారు.