
జయ్ న్యూస్, ఆలూర్: ఆలూర్ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త తన వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టి, పార్టీ అభ్యర్థి ఎవరు అయినా కలిసికట్టుగా పని చేస్తేనే విజయం సాధ్యమవుతుందని అన్నారు. పార్టీ గెలుపే మా అందరి లక్ష్యంగా ఉండాలని, మండల స్థాయి నుండి బూత్ స్థాయివరకు అందరూ నిష్టతో పనిచేయాలని సూచించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుర శ్రీకాంత్, మరంపల్లి గంగాధర్, నూతల శ్రీనివాస్ రెడ్డి, కొత్తూరు గంగాధర్, గిరీష్, డాక్టర్ అరుణ్, హర్ష హరీష్,రామ్ రెడ్డి మోతే శ్రావన్య, డిష్ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.