
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ లో మున్సిపల్ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. వినయ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో ప్రజలందరూ భాగస్వాములై ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా రెండు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, తాజా మాజీ కౌన్సిలర్ బండారి శాల ప్రసాద్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.