
జయ్ న్యూస్, ఆర్మూర్: ఇటీవల ఆర్మూర్ పట్టణ యువజన గౌడ సంఘ అధ్యక్షుడిగా నియామకమైనటువంటి బత్తుల శ్రీనివాస్ గౌడ్ ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. గౌడ సంఘం అభివృద్ధికి పాటుపడుతూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆర్మూర్ పట్టణ యువజన గౌడ సంఘం అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ గౌడ్ కు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వినయ్ రెడ్డి సూచించారు. యువజన గౌడ సంఘం పట్టణ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి నిరంతరం పాటు పడతామని అన్నారు. ప్రభుత్వం కూడా తమకు అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు & AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్, BC సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.