
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థి ఎన్నికలు జరిగాయి. విద్యార్థులు తమ ప్రతినిధులుగా తమ తోటి విద్యార్థులను ఎన్నుకొని విద్యార్థి సంఘ మండలిని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజాస్వామ్య విధివిధానాలను పాటిస్తూ, చక్కటి నిబంధనలతో ఎన్నికలు నిర్వహించారు. కళాశాల కెప్టెన్, వైస్ కెప్టెన్, సెక్రటరీ, మొదలగు 12 విభాగాల్లో నామినేషన్లు జరిగాయి. అధ్యాపక బృందం ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. విద్యార్థుల్లో సమర్ధతను, నాయకత్వ లక్షణాలను పెంపొందించే దిశగా ప్రతి సంవత్సరం ఎన్నికల నిర్వహణ ఉంటుందని, విద్యార్థుల ఎన్నికల మండలిని ఏర్పాటు చేస్తామని కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్. చంద్రిక చెప్పుకు వచ్చారు. గెలిచిన విద్యార్థి ప్రతినిధులను అభినందించారు. పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య ఎన్నికలు తలపించేలా ఎన్నికల నిర్వహణ జరిందని విద్యార్థుల కృషిని, అధ్యాపకులను కొనియాడారు.