
జయ్ న్యూస్, భీమ్ గల్: భీమ్ గల్ మండలం కారేపల్లి గ్రామంలో త్రిబుల్ ఐటీలో బాసర అడ్మిషన్ పొందిన కారేపల్లి గ్రామనికి చెందిన మూడవత్ అరవింద్, అట్లాగే మహబూబ్ నగర్ త్రిబుల్ ఐటీలో మూడవ మహేందర్ అడ్మిషన్లు పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వారికి సన్మానించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదివి బాసర త్రిబుల్ ఐటీలో సీట్ పొందిన వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ మాజీ చైర్మన్ కన్నే సురేందర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్, జిల్లా జనరల్ సెక్రెటరీ కుంట రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు అనంతరావు, పట్టణ అధ్యక్షులు JJ నరసయ్య, శ్రీను మరియు సిసి నరేష్ మరియు గ్రామ పెద్దలు వారికి అభినందించడం జరిగింది. అట్లాగే గ్రామ నాయక్, బాపులాల్ నాయక్, కార్బరి రవి నాయక్, మాజీ ఎంపీటీసీ, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంతోష్,అంబాజీ నాయక్, మంగ్త్య మోతిలాల్ మంగ్య వెంకటేష్, రాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.