
జయ్ న్యూస్, సిరికొండ : మండలంలోని పెద్ద వాల్గోట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, పెద్ద వాల్గోట్లో గ్రామ యువత ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు. తమ సొంత ఖర్చుతో చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. యువత సభ్యులు మాట్లాడుతూ, “ఆర్సీబీ జట్టు విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, గ్రామ విద్యార్థుల అభివృద్ధికి ఈ అడుగు వేశాం” అన్నారు.ప్రధానోపాధ్యాయులు బి. యవన్ ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ, విద్యార్థుల క్రమశిక్షణ, పాఠశాల ప్రతిష్ట పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, జెల్లీ వెంకటేష్, అక్షయ్, శేఖర్, ప్రసాద్, గణేష్, సతీష్ పాల్గొన్నారు.