
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల క్షత్రియ పాఠశాల విద్యార్థులకు నిన్న కృష్ణాష్టమి సందర్భంగా చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. అందులో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని చక్కగా చిత్రలేఖనం చేసి ప్రతిభ చాటారు. ఇందులో మేనేజ్మెంట్ మరియు ప్రధానోపాధ్యాయురాలు నవిత, విద్యార్థులకు ముందుండి ఎంతో సహకరించారు. ఆదివారం ఆర్మూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వారు (Iskcon ) సర్టిఫికెట్ లు ప్రధానం చేశారు.