
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజారులో గల 36, 30 వార్డులలో గుట్టకు దగ్గరలో కింది భాగంలో ఉన్న పలు ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్మూర్ పట్టణ BJP అధ్యక్షుడు మందుల బాలు సంఘటన స్థలానికి చేరుకొని ప్రజల సమస్యను తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునారవృతం కాకుండా అధికారులు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.